• Login / Register
  • ఫీచ‌ర్స్ న్యూస్‌

    Zakir Hussain|తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్ ఇక లేరు

    Zakir Hussain|తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్ ఇక లేరు
    Hyderabad :   భార‌త దేశానికి చెందిన ప్రముఖ తబలా వాద్యకారుడు (Zakir Hussain) ఉస్తాక్ జాకీర్ హుస్సేన్  ప‌ర‌మ ప‌దించారు. అనారోగ్యంతో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన ప్ర‌స్తుతం మరణించారు. గత వారమే ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయ‌న‌ను అక్క‌డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇన్నాళ్లు సంగీత ప్రపంచంలో ఎంతో చురుకుగా ఉన్న జాకీర్‌ హుస్సేన్‌కు కోట్లాది మంది అభిమానులూ త‌న సొంతం చేసుకున్నారు. 
    జాకీర్ హుస్సేన్ నేప‌థ్యం .. 
    జాకీర్ హుస్సేన్ ప్రసిద్ధ తబలా వాయిద్యకారుడు, ఆయన మార్చి 9, 1951న బొంబాయిలో (ప్రస్తుతం ముంబై) జన్మించారు. ఆయన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా ఖాన్. ఆయన ప్రసిద్ధ తబలా వాయిద్యకారుడు. అయితే తండ్రి దగ్గర తబలా వాయించే కళ నేర్చుకున్నాడు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఏడేళ్ల వయసులో కచేరీలలో తబలా వాయించడం ప్రారంభించాడ‌ట‌. ఈ మేర‌కు ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో (Zakir Hussain) జ‌కీర్‌ డాక్టరల్ డిగ్రీని పూర్తి చేశారు. 
    ఆ తర్వాత జాకీర్ 1991లో ప్లానెట్ డ్రమ్ కోసం డ్రమ్మర్ మిక్కీ హార్ట్‌తో కలిసి పనిచేశాడు. ఇది గ్రామీ అవార్డును గెలుచుకుంది. తరువాత సంవత్సరాల్లో హుస్సేన్ అనేక చిత్రాల సౌండ్ ట్రాక్‌లకు సహకరించారు. జాకీర్ హుస్సేన్‌కు 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. కొన‌సాగింపుగా అట్లాంటాలో జరిగిన ఒక సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు సంగీతం అందించిన బృందంలో ఆయన కూడా సభ్యుడు కావ‌డం ఆనాటి విశేషం. ఆల్-స్టార్ గ్లోబల్ కాన్సర్ట్‌లో పాల్గొనేందుకు 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌కి ఆహ్వానించిన తొలి భారతీయ సంగీతకారుడు కూడా. ఈ మేర‌కు జాకీర్ హుస్సేన్‌కు 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌ను కూడా భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. 
    సిని ప‌రిశ్ర‌మలో కూడా ఆయ‌న సేవ‌లు అందించారు. శశికపూర్‌తో కలిసి హాలీవుడ్ సినిమాలో నటించ‌డం ప్రారంభించిన‌ జాకీర్ హుస్సేన్ పలు సినిమాల్లో నటించారు. ఆయన 1983 బ్రిటీష్ చిత్రం హీట్ అండ్ డస్ట్‌లో యాక్ట్ చేశారు. శశికపూర్ కూడా ఈ సినిమాలో పనిచేశారు. జాకీర్ హుస్సేన్ 1998లో సాజ్ చిత్రంలో కూడా న‌టించారు.  ఈ చిత్రంలో ఆయన సరసన షబానా అజ్మీ నటించ‌డం విశేషం. ఈ చిత్రంలో షబానా ప్రేమికుడి పాత్రలో జాకీర్ హుస్సేన్ నటించారు. మొఘల్-ఎ-ఆజం (1960) చిత్రంలో సలీం తమ్ముడిగా జాకీర్ హుస్సేన్‌కు కూడా ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో అతని తండ్రి దానిని ఆమోదించలేదు. తన కొడుకు సంగీతంపై మాత్రమే దృష్టి పెట్టాలని అనుకోవ‌డం వ‌ల్ల ఆ పాత్ర‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చింది.
    *  *  *

    Leave A Comment